T20 World Cup in America : ఇండియాలో టీ20 ప్రపంచకప్.. రాజమార్గంలో అమెరికా ఎంట్రీ
టీ20 ప్రపంచ కప్ 10వ ఎడిషన్ కు సంబంధించిన కీలక ప్రకటనను ఐసీసీ రిలీజ్ చేసింది. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్నకు 12 జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో సూపర్-8 దశకు చేరిన 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. మిగతా 4 జట్లను ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపిక చేసింది.
తాజా టీ20 ప్రపంచ కప్ లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించిన న్యూజిలాండ్, పాకిస్థాన్లు ఐసీసీ టీ20 జట్ల ర్యాంకింగ్ ఆధారంగా రాబోయే టీ20 ప్రపంచ కప్ నకు నేరుగా అర్హత సాధించాయి.
భారత్, శ్రీలంక ఆతిథ్య దేశాలు కాబట్టి, 2026 టీ20 ప్రపంచ కప్ కు నేరుగా ప్రవేశం లభించింది. టీ20 ప్రపంచకప్ లో తొలిసారిగా సూపర్-3 దశకు చేరుకున్న అమెరికా జట్టు.. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో కూడా చోటు దక్కించుకుంది.
టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధించిన భారతదేశం, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణ ఆఫ్రికా, యుఎస్ఏ, వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ ఈ 8 జట్లు 2026 టీ20 ప్రపంచకప్ లో టాప్ 20 లో ఉంటాయి. నెక్స్ట్ వరల్డ్ కప్ లో ఓ రౌండ్ మ్యాచ్ లు శ్రీలంకలో జరిగితే..మరో రౌండ్ మ్యాచ్ లో ఇండియాలో జరిగే చాన్స్ ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com