Nehru Zoological Park : నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఆర్గాన్ ఫెయిల్యూర్ తో తాబేలు(125) మృతి

Nehru Zoological Park : నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఆర్గాన్ ఫెయిల్యూర్ తో తాబేలు(125)  మృతి

నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో (Nehru Zoological Park) దాదాపు 125 ఏళ్ల వయసున్న గాలాపాగోస్ పెద్ద తాబేలు వయసు సంబంధిత సమస్యలతో మృతి చెందినట్లు జూ అధికారులు తెలిపారు. "గలాపాగోస్ జెయింట్ తాబేలు, సుమారు 125 సంవత్సరాల వయస్సు, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించింది. అది గత 10 రోజులుగా ఆహారం తీసుకోలేదు" అని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఒక ప్రకటన విడుదల చేసింది. జూ వెటర్నరీ బృందం దాన్ని గత 10 రోజులుగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.

ఈ తాబేలు జూలోని పురాతన నివాసులలో ఒకటిగా పరిగణించబడుతుంది. మరో 95 ఏళ్ల తాబేలుతో పాటు, జంతుప్రదర్శనశాల ప్రారంభమైనప్పటి నుండి స్టార్ ఆకర్షణలలో ఒకటిగా ఉంది. ఈ తాబేలు 1963లో నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ (బాగ్-ఈ-ఆమ్) నుండి తరలించారు. ఆ తర్వాత దానిని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉంచారు.

తాబేలుకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. పలు అవయవాల వైఫల్యం కారణంగా తాబేలు చనిపోయిందని ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తదుపరి పరిశోధనల కోసం నమూనాలను VBRI, వెటర్నరీ కళాశాల, రాజేంద్రనగర్‌కు పంపారు.

Tags

Read MoreRead Less
Next Story