AP TDP MLA Counters : సీతక్కకు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే కౌంటర్

AP TDP MLA Counters : సీతక్కకు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే కౌంటర్
X

తెలంగాణ మంత్రి సీతక్కకు షాకిచ్చారు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే. వివాదాస్పదంగా మారిన నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి సంచలన విషయాలు చెప్పారు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. నిర్మల్ ఇథనాల్ కంపెనీతో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సంబంధం లేదన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ గ్రామంలో పెడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కుటుంబానిదని మంత్రి సీతక్క ఆరోపించారు. సీతక్క చేసిన వ్యాఖ్యలను పుట్టా ఖండించారు. నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీతో తలసాని కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదన్నారు. కేవలం బిజినెస్,అభివృద్ది కోసమే పెట్టామని టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు.

Tags

Next Story