TS : రేవంత్ ను బాలయ్య కలిసింది ఇందుకే!

TS : రేవంత్ ను బాలయ్య కలిసింది ఇందుకే!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే కలిశారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత బాలకృష్ణను కలవడం ఇది రెండోసారి.

సినిమా షూటింగ్లు.. ఆ తర్వాత ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఆయనను కలిసేందుకు అవకాశం దొరకలేదు. ఆదివారం కలిసిన సందర్భంగా సీఎంకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఏపీ రాజకీయాలపైన వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారు. దీంతో పాటు సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా ఏపీలో ఎన్ని కలు ముగిసిన తర్వాత బాలకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో ఏర్పాటయ్యే ప్రభుత్వంంపైనా కొద్దిసేపు చర్చించినట్టు తెలిసింది.

Tags

Next Story