TS : బీజేపీ ఫినిషింగ్ టచ్.. 10న ఎల్బీ స్టేడియంలో మోడీ బహిరంగ సభ

ఎన్నికల ప్రచార పర్వం నాలుగు రోజుల్లో ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో బీజేపీ ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన మంత్రి మోడీ నుంచి రాష్ట్ర నాయకుల వరకు హోరెత్తిస్తున్నారు. మోడీని తమ ఆఖరి భారీ సభకు పిలిచిన బీజేపీ నేతలు.. ప్రచారాన్ని కీలకమైన మలుపు తిప్పాలని భావిస్తున్నారు.
ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ రాజ్ భవన్లో మంగళవారం రాత్రికి బస చేసి, బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో వేములవాడకు చేరుకున్నారు. ఉదయం 5 గంటలకు అక్కడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ పర్యటనలో ఉదయం 8:30 గంటలకు మోదీ వేములవాడ శివారులోని బాలానగర్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. వరంగల్ లోనూ మోడీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఏపీకి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు రాజంపేట బీజేపీ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7. నుంచి 8 గంటలకు విజయవాడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ప్రధాని మోడీ రోడ్ జరుగుతుంది. పదో తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారాన్ని ముగిస్తారు మోడీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com