TS : జగిత్యాలలో కారు ప్రమాదం.. ప్రభుత్వ విప్ కు గాయాలు

నిజామాబాద్-హన్మకొండ (Nizamabad) (Hanmakonda) రహదారి మధ్యలో మరో ప్రమాదం జరిగింది. నిత్యం ఈ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువ. పెరుగుతున్న ప్రమాదాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని కలవరపరుస్తున్నాయి. రోడ్డు వెడల్పు పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
తాజాగా.. జరిగిన ప్రమాదంలో తెలంగాణ ప్రభుత్వ విప్ (Telangana Government Whip) గాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎండపల్లి మండలం అంబారిపేట (Ambaripeta) వద్దకు చేరుకున్నప్పుడు ఈ యాక్సిడెంట్ అయింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే కారు బోల్తా పడినట్టు తెలుస్తోంది.
ఈ యాక్సిడెంట్ లో లక్ష్మణ్ కుమార్ తో పాటు కారులో ఉన్న మరికొద్దిమందికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కరీంనగర్ పట్టణానికి తరలించారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ ను హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com