TS CM : మనవడితో శ్రీవారి సేవలో సీఎం రేవంత్

TS CM : మనవడితో శ్రీవారి సేవలో సీఎం రేవంత్
X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో సందడి చేశారు. మనవడి మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వెళ్లారు. రచన అతిథి గృహం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. మనమడి తలనీలాలు సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం తిరుమలకు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి తొలుత హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. రోడ్డు మార్గాన శ్రీవారి తిరుమలకు వెళ్లారు.

మనవడి తలనీలాలు స్వామి వారికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు పెంచారు.

Tags

Next Story