TG : ఖమ్మంలో కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ.. రఘురాం సక్సెస్ సీక్రెట్స్ ఇవే..!

TG : ఖమ్మంలో కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ.. రఘురాం సక్సెస్ సీక్రెట్స్ ఇవే..!
X

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మరోసారి ఖమ్మం ఉమ్మడి జిల్లా రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో భారీ మెజారిటీతో ఖమ్మం పార్ల మెంట్ స్థానం చరిత్రకెక్కింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామ సహాయం రఘురాంరెడ్డి 4,67,847 ఓట్ల మెజారిటీతో వీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత నామ నాగేశ్వరరావుపై రికార్డు మెజార్టీతో గెలుపొందారు.

రఘురాంరెడ్డికి మొత్తం ఓట్లు 7,66, 929 ఓట్లు రాగా, నామ నాగేశ్వరరావుకు 2, 99,082 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, ఓటర్ల ఆమోదం లభించి నట్లయ్యింది. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదికి తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన ఉమ్మడి జిల్లా ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుమించిన మెజారిటీని ఎంపీ అభ్యర్థికి అందించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారందరికీ ఆ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే రెట్టింపు స్థాయిలో మెజారిటీ రావ డంతో రామసహాయం రఘురాంరెడ్డికి ఘన విజయం సొంతమైంది. ఈ ఎన్నికలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్టీజ్ గా తీసుకుని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మరో మంత్రి తుమ్మల నాగేశ్వ రరావుల సహకారంతో వారి సారథ్యంలో, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల కృషితో భారీ మెజార్టీకి కారణమయ్యారు. మంత్రి పొంగులేటి, మరో మంత్రి తుమ్మల, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ప్రాతి నిథ్యం వహిస్తున్న పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ రావడం విశేషం. వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల నుండి కూడా భారీ మెజారిటీ కాంగ్రెస్ సాధించగలిగింది.

Tags

Next Story