Rain Alert : నాలుగు రోజులు భారీవర్ష సూచన

Rain Alert : నాలుగు రోజులు భారీవర్ష సూచన
X

రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుండి 40 కి. మీ.

వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలో రుతుపవనాలు మొదలు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారీ వర్షాలతోపాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

అదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ అదేవిధంగా రానున్న నాలుగు రోజుల పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. జూన్ 8 వరకు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, లింగంపల్లిలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు వస్తుంటాయి. కానీ ఈ సారి చాలా ముందుగానే రుతుపవనాలు తెలంగాణలోకి వచ్చేశాయి.

Tags

Next Story