Rains : జాడ లేని భారీ వానలు.. ఇలాగైతే కష్టమే!
నైరుతి రుతుపవనాల్లో మంద గమనం కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు. ఈ ఏడాది నిర్ణీత గడువు కంటే ముందుగానే నైరుతి రుతు పివనాలు రాష్ట్రాన్ని తాకాయి. దీంతో జూన్ నెలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. తొలి వారం రోజులు జోరు వానలు కురిసినప్పటికీ ఆ తరువాత నైరుతి విస్తరణలో జాప్యం చోటు చేసుకున్న కారణంగా చెదురు మదురు వర్షాలే పడుతున్నాయి. విజయ నగరం వద్ద నుంచి రుతుపవనాలు ముందుకు సాగక పోవడంతో వర్షాలు ఆశిం చిన మేర కురవడం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఉష్ణోగ్రతలు భగ్గు మంటున్నాయి.
సాధా రణం కంటే 4-5 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవు తున్నాయి. వడ గాల్పులు వీస్తున్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరో మూడు నాలుగు రోజుల్లో రుతుపవ నాల్లో కదలిక వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర ను ఆనుకొని ఉన్న తెలంగాణ మీదుగా తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్ల డించారు.
తెలంగాణ నుండి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వర కు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సహా పలు జిల్లాల్లో జల్లులు పడే ఛాన్స్ ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com