NTR: రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన

NTR: రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన
X

రాజకీయాలపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేశారు. తన తొలి ఆప్షన్ సినిమాలకేనని, రాజకీయాలకు కాదని ఆయన స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులోనే తాను తొలి సినిమా చేశానని తెలిపారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన సినిమాలకు లక్షలాది మంది ప్రేక్షకులు, అభిమానులు టికెట్లు కొంటున్నారని చెప్పారు. ఇంతమందిని కలుస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్న వేళ ఓ సినిమా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమి పాలుకావడంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకున్నారు.

Tags

Next Story