TS : కీరవాణి తెలంగాణ పదాలను ప్రపంచానికి చాటారు.. మహేశ్ కుమార్ గౌడ్

TS : కీరవాణి తెలంగాణ పదాలను ప్రపంచానికి చాటారు.. మహేశ్ కుమార్ గౌడ్

కవులు కళాకారులు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా ముందుకు వెళ్తామన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్. రూ.100 కోట్లు వెచ్చించి కట్టిన ఆకృతిలో ఒక్క అమర వీరుడి పేరు కూడా చెక్కించలేదని అన్నారు. ఇక్కడ చాలా మంది అసువులు భాస్తున్నారని.. తెలంగాణను సోనియమ్మే ఇచ్చారన్నారు. ప్రజలు కోరుకున్న చిహ్నం అందరితో సంప్రదించి, అతి త్వరలో ప్రజల అకాంక్షలకు చిహ్నంగా తీసుకువస్తామన్నారు.

అందెశ్రీ రాసిన గీతాన్ని ఆనాడు రామకృష్ణ అనే ఏపీ వ్యక్తితో పాడించారని గుర్తుచేశారు మహేశ్ గౌడ్. తాజా నిర్ణయాన్ని రెండేండ్ల కిందనే తాము ప్రకటించామనీ.. మంచి సంగీతం సమకూర్చాలని కీరవాణిని సంప్రదించామన్నారు. కళకి, కళాకారుడికి ప్రాంతాలు ఉండవనీ.. కీరవాణి ఎంపిక తమది కాదు, అది అందెశ్రీ ఆలోచన అన్నారు.

యాదగిరిగుట్టని యాదాద్రిగా మార్చిన ఆనందసాయి అనే వ్యక్తి ఆంధ్ర వాడేననీ.. అప్పుడు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ బ్రాండ్ అంబాసడర్లుగా ఎవరున్నారో గుర్తుతెచ్చుకోవాలన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ , మంచు లక్ష్మి , పుల్లెల గోపిచంద్ వీరిని నియమించినప్పుడు ఎవరూ ఏమీ అనలేదని అన్నారు. కీరవాణి ఆస్కార్ గెలిచినప్పుడు కేసీఆర్, కేటీఆర్ ట్వీట్ చేయలేదా? అన్నారు. RRRలో కీరవాణి తెలంగాణ పాటను, పదాలను ప్రపంచానికి చేరేలా ట్యూన్ అందించారన్నారు మహేశ్ కుమార్ గౌడ్.

Tags

Next Story