TG : రోడ్డుపై యాక్సిడెంట్.. మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి
X
By - Manikanta |24 Jun 2024 12:42 PM IST
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకుని ఆదివారం సాయంత్రం కూసుమంచి నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయిన క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ద్విచక్రంపై ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కాన్వాయ్ ఆపి అందులోని ఓ వాహనంలో క్షతగాత్రుడ్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రజలు, క్షతగాత్రుని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com