Maharashtra : పోటెత్తిన పెంగ.. మహారాష్ట్రతో తెగిన సంబంధాలు

ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, పెన్ గంగ, ప్రాణహిత నదులు పొంగిపొర్లుతున్నాయి. జైనథ్ మండలం సరిహద్దులోని పెనుగంగా వంతెనకు కొద్ది అడుగుల దూరంలోనే జాతీయ రహదారికి వరద ఉధృతి పెరగడంతో జిల్లా కలెక్టర్ రాజార్జి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆప్రాంతాన్ని సందర్శించారు. కామాయి, డిగ్రీస్ గ్రామాలను అలర్ట్ చేశారు. ఎలాంటి అవసరం వచ్చిన తమకు ఫోన్ చేయాలని లోతట్టు గ్రామాల ప్రజలకు సూచించారు.
సాంగిడి, పెండల్ వాడ గ్రామాలకు వరద ఉధృతి కారణంగా రాక పోకలు నిలిచిపోయి డిఆర్డిఎఫ్ రెస్క్యూ సిబ్బందిని ఆ గ్రామాలకు నాటు పడవ సహాయంతో కలెక్టర్ తరలించారు. వారికి ముందుజాగ్రత్తలను పోలీసులు వివరించారు. నదీ తీర ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిడంతో ఎమ్మెల్యేపాయల్శంకర్ పంట పొలాలను సందర్శించి వెంటనే సర్వే చేపట్టి విపత్తు పరిహారం అందించాలని అన్నారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ టి మండలం వెంకటాపూర్ అంత రాష్ట్ర రహదారి వద్ద వంతెనపై నుండి వరద ఉప్పెన పెరుగడంతో పోలీ సుల రెడ్ అలర్ట్ ప్రకటించి మహారాష్ట్రకు తెలంగాణకు రవాణ సంబధాలు నిలిపివేశారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకారణంగా మంగళ వారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com