Breaking : విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత

X
By - Manikanta |9 April 2024 11:05 AM IST
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ (Rajiv Ratan) గుండెపోటుతో చనిపోయారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ డీజీగా ఉన్నారు. ఈయన 1991 బ్యాచ్‌కు చెందినవారు. గతంలో ఆపరేషన్ ఐజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, కరీంనగర్ ఎస్పీగా చేశారు.
కిందటి ఏడాది మహేందర్ రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన టైంలో.. కొత్త పోలీస్ బాస్ రేసులో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినపడింది. రాజీవ్ మృతిపట్ల పలువురు ఐపీఎస్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మేడిగడ్డపై వ్యవహరంపై విచారణల జరిపిన రాజీవ్ రతన్ .. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com