TDP Contesting : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసుంటే : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. టీడీపీ 10% ఓట్లు దక్కించుకునేదని, అప్పుడు కచ్చితంగా తమ పార్టీ గెలుపోటములపై ప్రభావం పడేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ అహంకారం, అతి తెలివితేటల వల్ల దెబ్బతిన్నారని చెప్పారు. తాను సీఎం కావడం, బీఆర్ఎస్ ఓటమి, కేసీఆర్ ను గద్దెదించడమనే తన మూడు రాజకీయ లక్ష్యాలూ నెరవేరాయన్నారు.
గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే.. ఒక్కపనీ పూర్తిచేయలేనని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘అన్నీ స్తంభించిపోతాయి, ఆయా శాఖలలో ఎంతమందినని తొలగిస్తాం. నేను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రైవేటు ఇ న్ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు కూడా ఉంటాయి. అందులో కేవలం ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్ ఒక్కడే ఉండరు. ఒకసారి కేసు నమోదైతే బ్యాంకులు రూపా యి రుణం ఇవ్వవు ఓడీలను వెనక్కు తీసుకుంటాయి. అప్పులు తీర్చమని ఒత్తిడి తెస్తాయి. దాంతో రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి పెట్టడానికి ఎవ్వరూ ముందుకురారు’ అని చెప్పారు. హైదరాబాద్‌లో వైఎస్ జగన్ ఇంటిముందు కూల్చివేతల గురించి తనకు ఎవరూ చెప్పలేదని అన్నా రు. బయట మాత్రం చంద్రబాబు చెప్తేనే చేయించినట్టు ప్రచారం చేశారని అన్నారు.
ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకుని, జగనే ఖతమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘పాలనను విస్మరించినందుకే జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది. బాబు ఫోన్ చేస్తే హైదరాబాద్ లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేశామన్నది అబద్ధం’ అని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com