TS : ఝార్ఖండ్ గవర్నర్‌కు తెలంగాణ బాధ్యతలు

TS : ఝార్ఖండ్ గవర్నర్‌కు తెలంగాణ బాధ్యతలు
X

తెలంగాణ గవర్నర్ (Telangana Govrnor) బాధ్యతల్ని రాష్ట్రపతి ఎవరికి అప్పగిస్తారన్న ఉత్సుకతకు తెరపడింది. ఏపీ గవర్నర్ నజీర్‌కే తోటి తెలుగు రాష్ట్రం బాధ్యతల్ని ఇస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌‌ను తాత్కాలికంగా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. కోయంబత్తూరు నుండి రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్‌ గవర్నర్ గా ఎన్నికయ్యారు.

Tags

Next Story