TS : అప్పులు తీసుకున్న తెలుగు రాష్ట్రాలు

TS : అప్పులు తీసుకున్న తెలుగు రాష్ట్రాలు
X

తెలంగాణ ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల రుణం తీసుకోవడానికి సిద్ధమైంది. ఈమేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు శుక్రవారం ఇండెంటు పెట్టింది. 17 ఏళ్ల కాల పరిమితితో సెక్యూరిటీ బాండ్లను రిలీజ్‌ చేసింది. ఈ నెల 14న ఆర్‌బీఐ నిర్వహించే ఈ–వేలం ద్వారా ఈ అప్పు తీసుకోనుంది. రాష్ట్రంతో కలిపి నాలుగు రాష్ట్రాలు రూ.6,500 కోట్ల అప్పుల కోసం ఇండెంట్లు పెట్టాయి. కొత్తగా మరో రూ.4,000 కోట్ల అప్పులు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంగళవారం రిజర్వ్‌ బ్యాంకులో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేసి రూ.4,000 కోట్లు అప్పు తెస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలలో ఇప్పటి వరకు కలిపి ప్రభుత్వం రూ.17,000 కోట్ల అప్పులు తెచ్చింది.

Tags

Next Story