TS : చేసిన పాపాలే కేసీఆర్‌ను ముంచబోతున్నాయి : మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ (Telangana) లోక్ సభ రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగుతోంది. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు (BRS) గుడ్‌బై చెప్పారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుతో పాటు ఆయన కూతురు, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్‌ను వీడబోతున్నట్లు చెప్పారు. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరడంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు.
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ (KCR) సీఎంగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ చేసిన పాపాలే ఆయన్ని ఇప్పుడు చుట్టుముట్టాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkata Reddy) అన్నారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ నేతలు చేరడంపై స్పందించారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చారనీ.. అదే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
యాదాద్రి పునర్‌నిర్మాణంలో అవినీతి జరిగిందన్నారు. దీనిపై లోక్‌సభ ఎన్నికల తర్వాత విచారణ జరిపిస్తామని అన్నారు. అంతేకాదు.. యాదాద్రి పేరు మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామన్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్లే తెలంగాణలో ప్రస్తుతం కరువు వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనీ చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే.. కాంగ్రెస్‌లో చేరికలను కేసీఆర్ తట్టుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాము ఇంకా గేట్లు తెరవలేదనీ.. తెరవకముందే క్యూ కడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com