Tragic Death : కారులో ఊపిరాడక చిన్నారి మృతి

Tragic Death : కారులో ఊపిరాడక చిన్నారి మృతి

కారులో ఆడుకుంటూ ఓ చిన్నారి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొండాయిగూడెం గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటూ.. ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులోకి వెళ్లింది. మూడేళ్ల చిన్నారి కల్నిషా పాప కారులోకి వెళ్లగానే ఆటోమేటిక్ గా డోర్ లాక్ అయింది.

కారులో ఆడుకున్నాక బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా కారు తలుపులు తెరుచుకోలేదు. ఆడుకుంటానని వెళ్లిన కల్నిషా ఎంతకూ రాకపోవడంతో.. తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. తెలిసినవారిని అడిగారు. ఊరంతా గాలించారు. ఎక్కడా పాప కనిపించలేదు.

చివరికి ఎందుకో అనుమానం వచ్చి.. కారు వద్దకు వెళ్లి చూడగా పాప విగతజీవిగా కనిపించింది. కారు డోర్ క్లోజ్ అవ్వడంతో.. చిన్నారి ఊపిరాడక మృతిచెందింది. కారు సీట్లో విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన గ్రామప్రజలను కూడా కలచివేసింది.

Tags

Next Story