TG : రామ్మోహన్ తో మాట్లాడి వరంగల్‌కు విమానం రప్పిస్తా- కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా బొగ్గు కొరత లేకుండా చూస్తామని, విద్యుదుత్పత్తి పెంచడంపై దృష్టి సారిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) స్పష్టం చేశారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాలకు మోదీ కేబినెట్లో ప్రాధాన్యం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించడం, బండి సంజయ్ కు హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు ఇవ్వడం, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యునికేషన్స్ సహాయ మంత్రి బాధ్యతలు, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కుకుశాఖ సహాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించడం మంచి పరిణామమన్నారు.
విజయవాడ, హైదరాబాద్, విశాఖ, పుట్టపర్తి మొదలైన విమానాశ్రయాల సమర్థవంతమైన నిర్వహణతో పాటు అభివృద్ధికి బాటలు పడతాయని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్ విమానాశ్రయం కోసం రామ్మోహన్ నాయుడితో కలిసి తన వంతు ప్రయత్నం చేస్తానని కిషన్ రెడ్డి కాన్ఫిడెంట్ గా చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com