YCP: షాక్‌ల మీద షాకులు.. జనసేనలోకి బాలినేని..!
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఉండడం లేదని బాలినేని తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. కనీసం జగన్ అపాయిట్‌మెంట్ కూడా ఇప్పించకపోవడం ఆయనను మరింత ఆవేదనకు గురి చేస్తోందని తెలుస్తోంది. సం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఇంత కాలం చెబుతూ వస్తున్నారు. తాను ఈవీఎంలపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడం లేదని కూడా గతంలో పార్టీపై అసంతృృప్తి వ్యక్తం చేశారు.
జగన్ మాట్లాడినా...
బాలినేని శ్రీనివాసరెడ్డితో గురువారం తాడేపల్లిలో జగన్ సమావేశమై చర్చించారు. అయితే బాలినేనికి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇవ్వాల్సిన గుర్తింపు, పదవి.. విషయంలో జగన్ ఏమీ చెప్పకపోవడంతో ఆయన పార్టీ వీడతారనే ప్రచారం మరింత పెరిగింది. జిల్లాపై తిరుపతి నేత చెవిరెడ్డి ప్రకాష్ రెడ్డి పెద్దరికం ఉంటుందని స్పష్టం చేయడంలో బాలినేని అసంతృప్తితో బయటకు వచ్చారని చెబుతున్నారు. జగన్ తో సమావేశం ముగిసిన తర్వాత బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం ఇంకా ఊపందుకుంది.
బాలినేనికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే.. ఆయన పార్టీని చక్క బెడతారని పలువురు ప్రకాశం జిల్లా నేతలు ఇటీవల జగన్‌ను కలిసి విన్నవించారు. అయితే అసలు బాలినేనికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలియడంతో ... ఆయనకు మరో మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు బాలినేనిని టీడీపీలోకి రానివ్వరు. బీజేపీలో చేరలేరు. పవన్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది. గతంలో కూడా బాలినేనిపై ఈ ప్రచారం జరిగింది. అప్పట్లో ఖండించారు కానీ.. ఇప్పుడు ఖండించడం లేదు. దీంతో పార్టీ మార్పు ఖాయమని అంతా అనుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com