తునిలో మైనర్ బాలికపై అఘాయిత్య ప్రయత్నం

X
గురుకుల విద్యార్థినిపై అఘాయిత్య ప్రయత్నం, వీడియోతో బయటపడిన ఘటన, పోలీసుల అదుపులో నిందితుడు తాటిక నారాయణరావు

కాకినాడ జిల్లా తుని పట్టణం సంచలనానికి దారితీయబడింది. తుని కొండవారపు పేటకు చెందిన మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన కలకలం రేపింది.

పట్టణానికి చెందిన సీనియర్ దళిత నాయకుడు తాటిక నారాయణరావు, తాత అని చెప్పి గురుకుల పాఠశాల నుండి విద్యార్థినిని బయటకు తీసుకెళ్ళాడు. బాలికను తోటల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించగా, అక్కడే ఉన్న తోట యజమాని పరిస్థితిని గమనించి వీడియో తీశారు. దీనిని గమనించిన నారాయణరావు బాలికను స్కూటర్ పై తీసుకొని పరార్ అయ్యారు.

ఈ సంఘటనపై బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నారాయణరావును అదుపులోకి తీసుకుని విచారం ప్రారంభించారు. గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రిన్సిపాల్ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Tags

Next Story