Instagram : 80 వెడ్స్ 34 .. ఇన్‌స్టాగ్రామ్ కలిపింది ఇద్దరినీ

సోషల్ మీడియాలో పరిచయమైన 34 ఏళ్ల మహిళను ఓ 80 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) అగర్ జిల్లా సుస్నేర్ తహసీల్ సమీపంలోని మగారియా గ్రామానికి చెందిన బలురామ్ బగ్రీ (80) అనే వృద్ధుడు.. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన షీలా(34)ను సుస్నర్ కోర్టులో వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
బాలూరామ్‌తో ఫన్నీ రీల్స్ చేసి స్నేహితుడు విష్ణుగుజ్జార్ ఇన్‌స్టాలో షేర్ చేసేవారు. ఇవి చూసి షీలా బాలూరామ్‌తో పరిచయం పెంచుకున్నారు. ప్రేమ చిగురించడంతో ఈనెల 1న పెళ్లి చేసుకున్నారు. బాలరామ్ కుమారుడు, ముగ్గురు కుమార్తెలకు వివాహం అయ్యాయి. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోవడంతో అప్పుల పాలయ్యాడు.
జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూనే డిప్రెషన్‌లో పడిపోయాడు. ఈ క్రమంలో డిప్రెషన్‌కు గురైన బాలూరామ్ దాని నుంచి బయట పడేందుకు విష్ణుతో కలిసి ఈ రీల్స్ చేయడం స్టార్ట్ చేశారట. వీరి ప్రేమ వివాహంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వారి క్రియేటివిటీకి పని చెబుతున్నారు. ఇక సింగిల్స్ అయితే... లబోదిబో మంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com