America : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

మూడు వారాలుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) (Mohammad Abdul Arfaat) మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత రాయబాయ కార్యాలయం ప్రకటించింది. అర్ఫాత్‌ను గుర్తించేందుకు అక్కడి అధికారులతో కలిసి రాయబాయ కార్యాలయం అధికారులు పనిచేశారు. అయినప్పటికీ అతణ్ని రక్షించలేకపోయారు. క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ కోసం 2023లో అర్ఫాత్ అమెరికా వెళ్లారు. మహ్మద్ అబ్దుల్ మృత దేహాన్ని భారత్‌కు తరలించేందుకు అతని కుటుంబానికి సమాచారం అందించామని కాన్సులేట్ తెలిపింది.
ఈ ఏడాది అమెరికాలో పలువురు భారతీయ, భారతీయ సంతతి విద్యార్థులు మరణించారు. వరుస మరణాలు భారత్ లోని వారి కుటుంబాలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆమెరికా అనేది ఒక గమ్యస్థానంగా మారింది. 2022-2023 సంవత్సరంలో 2.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఆమెరికాకు వలస వెళ్లారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com