Google Pay Service : అమెరికాలో గూగుల్ పే సర్వీసులకు బ్రేక్

X
By - Manikanta |22 May 2024 12:38 PM IST
గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి పేమెంట్ యాప్ లపై జనం ఎక్కువగా ఆధారపడ్డారు. ప్రపంచమంతటా ఈ ప్రభావం పెరిగింది. ఐతే.. జూన్ 4 తర్వాత గూగు ల్ పే యాప్ యుఎస్ఎలో పని చేయదని రిపోర్టులు చెబుతున్నాయి.
గూగుల్ సంస్థ జూన్ 4 నుండి ప్రపంచంలోని అనేక దేశాలలో గూగుల్ పే సేవలను నిలిపివేయబోతోంది. ఆ తర్వాత నుంచి పేమెంట్స్ చేయలేరు. డైరెక్ట్ గా కాకుండా.. గూగుల్ వ్యాలెట్ నుంచి పేమెంట్స్ చేసేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది.
భారతదేశంతో సహా ఇతర దేశాలలో తమ గూగుల్ పే సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆ సేవలు యధావిధిగా కొనసాగుతాయని గూగుల్ సంస్థ తెలిపింది. సంస్థ చెప్పిన దేశాల్లోని యూజర్స్.. ఇప్పుడు గూగుల్ వాలెట్ ను వాడటం మొదలుపెట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com