Pakistan : పాకిస్తాన్‌లో భారీ వర్షాలు.. 87 మంది మృతి

పాకిస్థాన్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆయా ఘటనల్లో 87 మంది మరణించినట్లు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. మరో 80 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వర్షాలతో 2,715 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలిపింది. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టంపై పాక్ ప్రధాని షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.
నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మొత్తం 15 మంది మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా 11 మంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారని ఎన్‌ఎండీఏ తెలిపింది.
వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ తన అంచనా నివేదికలో ఏప్రిల్ 22 వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరిక జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com