India : చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కొత్త ప్రయత్నం

India : చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కొత్త ప్రయత్నం
X

డ్రాగన్ కంట్రీకి సరిహద్దులో గుణపాఠం చెప్పేందుకు భారత ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రచించింది. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్ లోని రెండు డజన్లకు పైగా ప్రాంతాల పేర్లను మార్చాలని మోడీ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చినట్లు భారత్ కూడా టిబెట్ లోని పలు ప్రాంతాల పేర్లు మార్చాలని పక్కా ప్రణాళిక రచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈపేర్లకు సంబంధించి టిబెట్ స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, దానిపై విస్తృతమైన చారిత్రక పరిశోధన కూడా కొనసాగిస్తోంది. పరిశోధన కేంద్రాలు ఉదాహరణకు కోల్కతాలోని బ్రిటిష్ కాలం నాటి ఏసియాటిక్ సొసైటీ వంటి సహకారం కూడా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. టిబెట్ లోని పలు ప్రాంతాల పేర్లు మార్చడం ద్వారా డ్రాగన్ దేశానికి గట్టి హెచ్చరిక చేయనుంది. 2017లో అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది.

వాస్తవాధీన రేఖకు సమీపంలోని 11 నివాసిత ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సుకు డ్రాగన్ దేశం పేర్లు మార్చడం సంచలనం రేపింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అమెరికా సైతం చైనా తీరును ఖండించింది. అయినా చైనా తన వక్రబుద్ధిని మానుకోలేదు. 2021లో రెండోసారి 15 ప్రాంతాలు, 203లో మూడోసారి 11 ప్రాంతాల పేర్లు మార్చేసింది. మోడీ ప్రభుత్వం డ్రాగన్ కంట్రీకి గట్టి గుణపాఠం చెప్పాలని డిసైడయ్యారు. పేర్లు పెడుతూ.. సరికొత్త యుద్ధానికి తెరతీశారు.

Tags

Next Story