Princess Diana : ప్రిన్సెస్ డయానా పర్సనల్ లెటర్ల వేలం

Princess Diana : ప్రిన్సెస్ డయానా పర్సనల్ లెటర్ల వేలం

అందంతో పాటు తన సేవాగుణంతో అంతులేని ప్రజాభిమానం సంపాదించుకున్న బ్రిటన్ ప్రిన్సెస్ డయానా కు సంబంధించిన కొన్ని వస్తువులు వేలం వేయనున్నారు. తన వ్యక్తి గత సేవకుడికి రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇందులో ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను అందులో పంచుకున్నట్లు తెలుస్తోంది.

తన జీవితంలో మధుర క్షణాలు, అనేక సంఘటనలకు సంబంధించిన అనుభవాలను తన మాజీ హౌస్ కీపర్ మాడ్ పెండ్రీతో ప్రిన్సెస్ డయానా పంచుకున్నారు. జీవితంలోని మైలు రాళ్లనూ ప్రస్తావించారు. ప్రిన్స్ చార్లెస్ తో 1981లో డయానాకు వివాహం జరిగిన తర్వాత.. తన హనీమూన్ విషయాలను ఇందులో తెలిపారు. తన మొదటి సంతానమైన విలియం జన్మించినప్పుడు కలిగిన సంతోషాలను అందులో పంచుకున్నారు.

నూతన సంవత్సరం, క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆమె ఇతరులకు రాసిన లేఖలు కూడా వేలానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికాలోని బెవర్లీ హిల్స్లో ఉన్న జులియన్ ఆక్షన్ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో జూన్ 27న వేలం నిర్వహించనున్నారు. వీటికి భారీ స్పందన రానుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. చిన్నవయసులోనే విడాకుల తర్వాత కారు ప్రమాదంలో ఆమె చనిపోవడం ఇప్పటికీ సంచలనమే.

Tags

Next Story