Road Accident : లండన్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం

Road Accident : లండన్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం
X

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్‌కు చెందిన తర్రె చైతన్య, రిషితేజగా గుర్తించారు.

లండన్‌లో నివాసం ఉంటున్న కొంతమంది తెలుగు విద్యార్థులు వినాయక నిమజ్జనంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరి కారును వేరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చైతన్య, రిషితేజ అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌, ఉప్పల్‌ ప్రాంతాలకు చెందినవారు.

ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని సమాచారం. ఈ ఘటనతో హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు

Tags

Next Story