Top

వడ్డీతో సహా చెల్లించే రోజు వస్తుంది: చంద్రబాబు

వడ్డీతో సహా చెల్లించే రోజు వస్తుంది: చంద్రబాబు
X

ఏపీలో అరాచకపాలన కొనసాగుతోందని ఫైర్‌ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు.. ప్రశ్నించిన టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న తటస్తులపైనా.. కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమషా రాజకీయాలు చేయోద్దని సీఎం జగన్‌ను హెచ్చరించారు. ఎవరూ అధికారంలో శాశ్వతంగా ఉండరన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎక్కువ సమయం పట్టదన్నారు. వడ్డీతో సహా తీర్చుకునే రోజు వస్తుందన్నారు చంద్రబాబు. పత్రికలు, ప్రతిపక్షాలపై దాడులు మానుకోవాలన్నారు. పోలీసు వ్యవస్థను కూడా చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పుడు చేస్తున్న అక్రమ కేసులకు భవిష్యత్తులో జవాబుదారీతనంగా ఉండాల్సి వస్తోందన్నారు.

Next Story

RELATED STORIES