AP : ఏపీలో అధికారికంగా ఉగాది వేడుకలు

AP : ఏపీలో అధికారికంగా ఉగాది వేడుకలు

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. రాష్ట్రస్థాయిలో విజయవాడలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉ.9 గంటలకు కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 18 మంది వేద పండితులు, అర్చకులను అధికారులు సత్కరిస్తారు. అలాగే ప్రతి జిల్లాలో ఇద్దరు అర్చకులు, ఓ వేద పండితుడిని సత్కరించి ఓ ప్రశంసా పత్రం, రూ.10,116 సంభావన, కొత్త వస్త్రాలు అందజేస్తారు.

తెలుగు ప్రజలకు సీఎం జగన్ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది ప్రజలందరికీ శుభాలు జరగాలి. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలి. అన్ని వృత్తుల వారు ఆనందంగా ఉండాలి. ప్రతి ఇల్లూ కళకళలాడాలి. మన సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి’ అని ఆకాంక్షించారు.

తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు.. మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందాం. ఈ ఉగాది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలి’ అని ఆయన ఆకాంక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story