AP : 41 శాతం పెరిగిన చంద్రబాబు ఆస్తులు

AP : 41 శాతం పెరిగిన చంద్రబాబు ఆస్తులు

మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబీకుల ఆస్తులు గత ఐదేళ్లలో 41 శాతం పెరిగి రూ.931 కోట్లకు చేరుకున్నాయని తెలిసింది. ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ లో ఈ విషయం తేలింది. మే 13న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కుప్పంలో తన భర్త తరపున నాయుడు భార్య ఎన్ భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

2019లో అఫిడవిట్ ప్రకారం, నాయుడు కుటుంబం రూ. 574.3 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను కలిగి ఉంది. తాజాగా మొత్తం షేర్ హోల్డింగ్ విలువ దాదాపు రూ.764 కోట్లుగా ఉంది. భువనేశ్వరి వద్ద 3.4 కిలోల బంగారం, దాదాపు 41.5 కిలోల వెండి కూడా ఉంది. ఆ కుటుంబం మొత్తం రూ.10 కోట్లకు పైగా అప్పులు కలిగి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రికి రూ. 2.25 లక్షల విలువైన అంబాసిడర్ కారు కూడా ఉంది. 24 ఎఫ్ఐఆర్ లలో చంద్రబాబు పేరుంది.

చంద్రబాబు రూ.4,80,438 విలువైన చరాస్తులుఉన్నాయి. రూ. 36,31,00,481 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఎంఏ చదువుకున్న బాబు తిరుపతి ఎస్వీయూ కళాశాలలో చదివారు. 1974లో యూనివర్సిటీ చదువు పూర్తిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story