AP : నామినేషన్ల దాఖలుకు నేడే లాస్ట్

AP : నామినేషన్ల దాఖలుకు నేడే లాస్ట్

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఉపసంహరణకు ఈ నెల 29 వరకు ఛాన్స్ ఉంటుంది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. ఈ నాలుగో దశలో ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్ , బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇప్పటి వరకు ఏపీలో అసెంబ్లీకి 3,644..అదే విధంగా లోక్ సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్క రోజే అసెంబ్లీకి 1,294, లోక్ సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు కావడం విశేషం.

నిన్నటితో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించిన సీఎం జగన్.. ఇవాళ పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందుల వెళ్తారు. అక్కడ సీఎస్ఐ చర్చి గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story