Heavy Rains : నేడు తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు

Heavy Rains : నేడు తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఏపీ లోని శ్రీకాకుళం, అల్లూరి, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. ఉమ్మడి అదిలాబాద్ , నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్ , రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.

నిన్న పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వడగళ్ల వానకు జొన్న, వేరుశనగ, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొట్టుకుపోయింది. అయితే తడిసిన ధాన్యాన్నీ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో అకాల వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరిపిన సీఎం.. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story