ఫ్యాక్షన్ నేత సీఎం అయితే రాష్ట్రం ఇలాగే ఉంటుంది: లోకేశ్‌

ఫ్యాక్షన్ నేత సీఎం అయితే రాష్ట్రం ఇలాగే ఉంటుంది: లోకేశ్‌
పురంశెట్టి అంకులు హత్య కేసులో స్థానిక ఎస్‌ఐ బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే కాసు ప్రమేయముందని లోకేశ్‌ ఆరోపించారు.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో హత్యకు గురైన పెదగార్లపాడు మాజీ సర్పంచ్‌ అంకులు కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పరామర్శించారు. నారా లోకేష్‌తోపాటు చినరాజప్ప, యరపతినేని శ్రీనివాసరావు సహా పలువురు నేతలు పెదగార్లపాడు వెళ్లారు. పురంశెట్టి అంకులు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన పార్ధివ దేహానికి లోకేష్‌ నివాళులర్పించారు.

పురంశెట్టి అంకులు హత్య కేసులో స్థానిక ఎస్‌ఐ బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే కాసు ప్రమేయముందని లోకేశ్‌ ఆరోపించారు. గ్రామస్థులతో మీటింగ్‌లో అంకులు హత్యకు ఎమ్మెల్యే స్కెచ్ వేశారని అన్నారు. ఎస్‌ఐ పిలిస్తేనే పురంశెట్టి అంకులు ఇంటి నుంచి వెళ్లారని తెలిపారు. అంకులు ఫోన్ ఏమయ్యింది..? వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదని లోకేశ్‌ ప్రశ్నించారు.

అటు..19 నెలల వైసీపీ పాలనలో 16 మంది టీడీపీ కార్యకర్తల్ని హతమార్చారని లోకేశ్‌ మండిపడ్డారు. ఫ్యాక్షన్ నేత సీఎం అయితే రాష్ట్రం ఇలాగే ఉంటుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల నేతలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. పులివేందులలో దళిత మహిళను కిరాతకంగా హత్య చేశారని చెప్పారు. మైనింగ్‌లో అక్రమాలు ఉన్నాయంటే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.


Tags

Read MoreRead Less
Next Story