Nara Lokesh: సీఎం జగన్‌కు నారా లోకేష్ మరోసారి లేఖ..

Nara Lokesh: సీఎం జగన్‌కు నారా లోకేష్ మరోసారి లేఖ..
Nara Lokesh: సీఎం జగన్ కు నారా లోకేష్ మరోసారి లేఖ సంధించారు.

Nara Lokesh: సీఎం జగన్ కు నారా లోకేష్ మరోసారి లేఖ సంధించారు. తొలగించిన ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వెంటనే వారికి 20 నెలల జీతాల బకాయిలను తక్షణం చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ ఇచ్చిన హామీలను మళ్లీ ఆయనకే గుర్తుచేయాల్సి రావడం విచారకరమన్నారు.

పాదయాత్రలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తాను ఉన్నాను..వారి బాధ విన్నానన్న జగన్.. అధికారంలోకి రాగానే వారిని విస్మరించారని లోకేష్ విమర్శించారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌కు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న ముఖ్యమంత్రి గారి మాట ఏమైందని ఎద్దేవా చేశారు. హామీలను గాలికొదిలేసిన సీఎం కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలిస్తున్న ఏజెన్సీలను రద్దుచేసి మరో మోసానికి తెరదీశారని అన్నారు.

ఒక్క వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న వేలాది మందిని ఆప్కాస్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు పత్రాలు ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగులు కింద సీఎఫ్‌ఎంఎస్ ఐడీలు క్రియేట్ చేసి సీఎంజగన్ ఉద్యోగుల గొంతు కోశారని లోకేష్ మండిపడ్డారు.

ఏజెన్సీలు లేకుండా జీతాలు ఎలా ఇవ్వగలమంటూ 20 నెలల జీతాలు ఎగ్గొట్టి అందిరినీ ఉద్యోగాల్లోంచి తీసేసి పంపేయడం దారుణమైన నిర్ణయమని విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల 20 నెలల జీతాలు రాక వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలు పస్తులుంటున్నాయని లోకేష్ లేఖలో ప్రస్తావించారు.

మరోవైపు వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా CFMSలోనమోదు చేయడంతో తెల్లరేషన్ కార్డులు రద్దయ్యాయని, వారు అమ్మ ఒడితోపాటు ప్రభుత్వపథకాలు దేనికి అర్హులు కాకుండా పోయారని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఇచ్చిన మాట తప్పి జగన్ వారికి ఉద్యోగాలే లేకుండా చేయడం వేలాది కుటుంబాలకు తీరని అన్యాయమేనన్నారు.

Tags

Read MoreRead Less
Next Story