AP: డ్రగ్స్‌ క్యాపిటల్‌గా ఆంధ్రప్రదేశ్‌

AP: డ్రగ్స్‌ క్యాపిటల్‌గా ఆంధ్రప్రదేశ్‌
ప్రతిపక్ష నేతల తీవ్ర విమర్శలు.... ఉడ్తా ఆంధ్రప్రదేశ్‌గా మారిందన్న షర్మిల

దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారైందని APCC అధ్యక్షురాలు YS.షర్మిల అన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసిన షర్మిల గంజా, హెరాయిన్, కొకైన్ ఏది కావాలంటే అది దొరికే... "ఉడ్తా ఆంధ్రప్రదేశ్" అయ్యిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు, ఏపీలోనే ఉన్నాయన్నారు. ఈ పదేళ్లలో ఏపీని డ్రగ్స్ కు కేరాఫ్ గా మార్చేశారని ఆరోపించారు. 25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే తమ తప్పు లేదని వైసీపీ , తెలుగుదేశం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల... నిఘా వ్యవస్థ సహకారం లేకుండా, వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయని ప్రశ్నించారు. ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు, సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని షర్మిల కేంద్రాన్ని డిమాండ్ చేశారు.


మరోవైపు విశాఖ గంజాయి, డ్రగ్స్ కు రాజధానిగా మారిందని, దేశంలో మాదకద్రవ్యాలు ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని భారతీయ జనతా పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆక్షేపించారు. విద్యార్థులు గంజాయికి...... బానిసలు అవుతున్నారని, గంజాయిని నియంత్రించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని....... ఆయన విశాఖలో విమర్శించారు. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై లోతైన విచారణ చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.


విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో తన పేరుపై పోస్టుపెట్టడంపై నరసరాపుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సచివాలయంలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలిసి విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై వైసీపీ ఆరోపణలు చేస్తోందని... ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కృష్ణదేవరాయలు..... ఆధారాలు సమర్పించారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతుండగానే.. నిజనిర్ధారణ కాకుండానే తన ప్రతిష్టకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేసిన వైకాపాపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story