CBN: ఎండబాదుడు కంటే జగన్ బాదుడు ఎక్కువ

CBN: ఎండబాదుడు కంటే జగన్ బాదుడు ఎక్కువ
సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో ప్రజాగళం సభ... వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో ప్రజాగళం సభ నిర్వహించారు. జగన్‌ చెప్పిన అబద్ధం చెప్పకుండా..మళ్లీ చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎండల బాదుడు కంటే వైసీపీ బాదుడే ఎక్కువని....... ఎద్దేవా చేశారు. మే 13న వైసీపీ మాడి మసైపోతుందన్నారు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలి అని చంద్రబాబు ఆకాంక్షించారు. వాలంటీర్లు రాజీనామా చేయవద్దని,అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వాలంటీర్లు వైసీపీకి అండగా నిలవద్దని ఆయన సూచించారు. వైసీపీ ప్రభుత్వ ప్రతి స్కీమ్‌లోనూ.. స్కామ్ ఉంటుందని ఆరోపించారు. పేదల బియ్యం రీసైక్లింగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేశారని దుయ్యబట్టారు. కోర్టులో దస్త్రాలు చోరీ చేసిన దొంగను పట్టిస్తానచంద్రబాబు అన్నారు. కేజీఎఫ్‌ అంటే కాకాని గోవర్ధన్‌ ఫీల్డ్‌ అని ఆరోపించిన చంద్రబాబు కేజీఎఫ్‌ సృష్టించిన కాకాణిని ప్రజలు అందులోనే పాతిపెడతారని అన్నారు. కాకాణి అరాచకంతో కృష్ణపట్నం నుంచి కంటైనర్‌ టెర్మినల్‌ తరలిపోయిందని ఆరోపించారు. క్వార్ట్జ్‌లో4 వేల500 కోట్లు దోపిడీ జరిగిందని చంద్రబాబు వివరించారు. ఏపీలో క్లాస్ వార్ కాదు..క్యాష్ వార్ నడుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తోందని అన్నారు. అవినీతిపరులను మట్టికరిపించాలని పిలుపు నిచ్చారు.


మరోవైపుపుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్ ' వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు...చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని..భగవంతుడిని వేడుకుంటున్నానని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కణేకల్లులో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. వేదపండితులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు చంద్రబాబును ఆశీర్వదించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని...ఆయన పదికాలాల పాటు చల్లగా ఉండాలని...బాపట్ల జిల్లా చీరాల తెదేపా అభ్యర్థి కొండయ్య అన్నారు. చీరాల తెదేపా కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వృద్ధులకు అన్నదానం చేశారు. వచ్చే పుట్టిన రోజుకు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూస్తామని...విశాఖ జిల్లా తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జి అన్నారు. లోక్ సభ అభ్యర్థి భరత్ తో కలిసి కేక్ కట్ చేశారు. కర్నూలు తెదేపా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు మరెన్నో పు ట్టినరోజులు చేసుకోవాలని...ఆదోని తెదేపా అభ్యర్థి పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆకాంక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story