AP: స్పీకర్‌ విచారణకు హాజరైన వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు

AP: స్పీకర్‌ విచారణకు హాజరైన వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు
విచారణ జరిగిన తీరుపై అసంతృప్తి.... చట్టాలపై గౌరవం పోగొట్టేలా స్పీకర్‌ వ్యవహర తీరు ఉందని విమర్శ

ఆరోపణలకు ఆధారాలు ఏవీ అంటే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి వద్ద సమాధానం లేదని వైసీపీ రెబల్ M.L.A.లు ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖితపూర్వకంగా తాము సమాధానం ఇచ్చినా దానికి రసీదు అడిగితే స్పీకర్ ఇవ్వలేదనికోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. చట్టాలపై గౌరవం పోగొట్టేలా ఆయన తీరు ఉందని మండిపడ్డారు. తనపై ఫిర్యాదు చేసిన చీఫ్ విప్ ప్రసాద్ రాజు విచారణలో ఉండాలని కోరితే అందుకు స్పీకర్ నిరాకరించారని ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. తమ వాదన వినిపించడానికి నాలుగు వారాల సమయం కావాలని అడిగామని తెలిపారు.


మరోవైపు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ జారీచేసిన నోటీసులపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మండలి ఛైర్మన్ నోటీసును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య వేసిన పిటిషన్ పైనా.... విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.... ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదావేసింది.

శాసనసభ్యత్వానికి. తాను చేసిన రాజీనామాను ఆమోదించిన తీరును సవాలు చేస్తూ తెలుగుదేశం నాయకులు గంటా శ్రీనివాసరావు వేసిన పిటిషన్ పై కౌంటర్ వేయాలని ఏపీ స్పీకర్ సహా ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు స్పీకర్ నిర్ణయంపై గంటా శ్రీనివాసరావు వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో తన రాజీనామాను నిబంధనల ప్రకారం ఆమోదించలేదని గంటా కోర్టుకు తెలిపారు. రెండేళ్ల క్రితం ఇచ్చిన రాజీనామాను.... రాజ్యసభ ఎన్నికలకు ముందే ఆమోదించడంలో అర్థమేంటని వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయనీయరాదనే ఉద్దేశంతోనే.. తన రాజీనామాను హుటాహిటిన ఆమోదించారని తెలిపారు. ఈ మేరకు....... ఏపీ న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారికి... కౌంటర్ వేయాలని హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ... మూడు వారాలకు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story