AP : వైసీపీకి భారీ షాక్.. MLA చిట్టిబాబు జంప్

AP : వైసీపీకి భారీ షాక్.. MLA చిట్టిబాబు జంప్

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల వేళ అధికార YCPకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రాజీనామా చేశారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన చిట్టిబాబుకు ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన వైసీపీకి పార్టీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నానని చిట్టిబాబు తన రాజీనామా లేఖలో వెల్లడించారు.

వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారడం అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి పి. గన్నవరం నుండి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story