Balakrishna : బాలకృష్ణ కూతురు, అల్లుడి ఆస్తులు ఎన్నంటే?

Balakrishna : బాలకృష్ణ కూతురు, అల్లుడి ఆస్తులు ఎన్నంటే?

హీరో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, అల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పేరిట రూ.393.41 కోట్ల ఆస్తులున్నాయి. భరత్ పేరిట రూ.16.89 కోట్ల చరాస్తులు, రూ.183.95 కోట్ల స్థిరాస్తులు.. తేజస్విని పేరుతో రూ.48.36 కోట్ల చరాస్తులు, రూ.44.20 కోట్ల స్థిరాస్తులున్నాయి. భరత్కు 7 కేజీల గోల్డ్, 51 కేజీల సిల్వర్.. తేజస్వినికి 5.3 కేజీల బంగారం, 52.50 కేజీల వెండి ఉంది.

ఇక చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఆమె తమ ఆస్తులను ప్రకటించారు. ఇద్దరికీ కలిపి రూ.931 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇది 2019 ఎన్నికల నాటి ఆస్తులతో పోలిస్తే 39 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. రూ.3 కోట్ల విలువైన బంగారం, డైమండ్స్, వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబుపై 24 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. తన పేరిట రూ.81.63 కోట్ల ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు అని, కొడుకు మోక్షజ్ఞ ఆస్తులు రూ.58.63 కోట్లు అని తెలిపారు. తనకు రూ.9.9కోట్లు, తన భార్యకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story