TTD : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

TTD : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా దర్శనానికి వెళ్తున్నారు. నిన్న శ్రీవారిని 55,756 మంది దర్శించుకోగా.. 17,866 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.71 కోట్లు సమకూరింది.

శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థాన వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉగాదిని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం ఆలయ శుద్థి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు.

ఫల, పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్‌ను ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల ఆపిల్‌, ద్రాక్ష, బత్తాయి, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు.

Tags

Read MoreRead Less
Next Story