TTD : శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

TTD : శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 59,621 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,351 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరింది.

తిరుమల శ్రీవారి భక్తుల సూచనల మేరకు డిప్‌లో వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల కేటాయింపును పరిశీలిస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. వేసవిలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సర్వదర్శనం టోకెన్ల జారీని 30వేల వరకు పెంచామని.. బ్రేక్‌ దర్శన సిఫార్సు లేఖలు రద్దుచేయడంతో రెండు గంటలు అదనంగా సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామన్నారు.

ప్రస్తుతం తిరుమలలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. కంపార్టుమెంట్లు అన్ని నిండిపోతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ధ్వజరోహనం నిర్వహించారు. కొద్ది సేపటి క్రితం పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 వరకూ కొనసాగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story