TTD : రూ.2 వేల నోట్లు మార్పిడి..టీటీడీకి ఆర్బీఐ అవకాశం

TTD : రూ.2 వేల నోట్లు మార్పిడి..టీటీడీకి ఆర్బీఐ అవకాశం

రూ.2వేల నోట్ల మార్పిడికి టీటీడీకి ఆర్బీఐ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉన్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్‌ అవకాశం కల్పించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7వ తేదీ నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసింది. ఐతే.. పలు దఫాలు గడువు పొడిగిస్తూ ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లు మార్పిడి చేసుకునే అవకాశం కల్పించింది.

అయితే రెండు వేల నోట్ల రూపాయలు బ్యాన్ చేసినా తర్వాత కూడా.. కొందరు భక్తులు స్వామి వారి హుండీలో వాటిని సమర్పించారు. దీంతో ఆ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలని టీటీడీ ఉన్నతాధికారులు ఆర్‌బీఐని పలుమార్లు కోరారు.

సానుకూలంగా స్పందన రావడంతో గతేడాది అక్టోబరు 8వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 22వ తేదీ వరకూ అయిదు విడతల్లో రూ.3.20 కోట్ల విలువైన నోట్లు మార్చినట్లు సంబంధిత వర్గాల సమాచారం. నోట్ల రద్దు మొదటి విడతలో టీటీడీ ఇచ్చిన సుమారు రూ.50 కోట్లను రిజర్వ్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది. దీంతో.. ఈసారి రూల్స్ ప్రకారం మార్పిడికి ప్రయత్నాలుచేస్తోంది టీటీడీ.

Tags

Read MoreRead Less
Next Story