TS : బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల బ్రాంచీలు మూసివేత?

TS : బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల బ్రాంచీలు మూసివేత?

BRS : బీఆర్ఎస్ మునుపెన్నడూ లేని గడ్డురోజులు చూస్తోంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి సొంత రాష్ట్రంలోనే సమస్యలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ప్రారంభించిన బ్రాంచీల నుంచీ ఒత్తిడి ప్రారంభమయింది. గతంలో మహారాష్ట్రతో పాటు ఒడిషా, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల నుంచి కొంత మంది నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. మహారాష్ట్రలో అయితే .. ఓ మిషన్ లాగా చేరికల్ని ప్రోత్సహించారు. పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి చేర్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీగా భారీగా సాయం చేస్తామని ఆశ పెట్టి చేర్చుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి.

ఇప్పుడు ఓడలు బండ్లయ్యాయి. పరిస్థితి మొత్తం మారిపోయింది. కేసీఆర్ ఓడిపోవడంతో… వేరే రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి లేదు. ఒడిషా నుంచి గిరిధర్ గమాంగ్ ఫ్యామిలీని చేర్చుకున్నారు. ప్రత్యేక విమానంలో పిలిపించుకుని మరీ వారికి కండువా కప్పారు. ఇప్పుడు పట్టించుకోకపవడంతో వారంతా వెళ్లి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక ఏపీ శాఖది మరో విచిత్రకథ. జనసేనను వదిలేసి.. తోట చంద్రశేఖర్ కేసీఆర్ వెంట నడిచారు. ఇప్పుడు ఆయన ఇబ్బంది పడుతున్నారు. జనసేనలో ఉండి ఉంటే.. పొత్తుల్లో భాగంగా ఏదో ఓ సీటు వచ్చేదని.. తన కోరిక తీరేదని అనుకుంటున్నారు. ఇప్పుడు జనసేనలో చేరినా టిక్కెట్ ఇచ్చే చాన్స్ లేదు.

కేసీఆర్ ఇచ్చే ఫండ్ పై ఎక్కువ ఆశలు పెట్టుకున్న మహారాష్ట్ర నేతలు బాగా డిజప్పాయింట్ అయ్యారు. వారు ప్రత్యేక సమావేశం పెట్టుకుని పోటీపై తేల్చాలంటున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఫోన్లు కూడా ఎత్తడం లేదట. నాగపూర్ లో ప్రారంభించిన పార్టీ ఆఫీస్ ను పట్టించుకునేవారు లేరు. దీంతో వారు తెలంగాణ మీడియాకు సమాచారం ఇచ్చారు. కేసీఆర్ చడీచప్పుడు లేకపోవడంతో..ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ దుకాణాలు మూసినట్టేనని చెప్పుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story