పోలవరానికి నిధుల కొరత.... అధికారులపై కాంట్రాక్టర్‌ల ఒత్తిడి

Update: 2019-05-28 11:02 GMT

పోలవరం వద్ద ప్రాజెక్టు అథారిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి సీఈఓ ఆర్కే జైన్, పీపీఏ చీఫ్ ఇంజినీర్ ఏకే ప్రధాన్, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌తో పాటు అధికారులు, నవయుగ ప్రతినిధులు హాజరయ్యారు. పీపీఏ అధికారులు ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించనున్నారు. అటు.. 30వ తేదీన విజయవాడలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనుంది. ఐతే.. నిధుల చెల్లింపు విషయమై పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు స్పష్టతను ఇవ్వలేదు. పనులపై పెండింగ్ బిల్లుల ప్రభావం పడుతుండడంతో.. ఇరిగేషన్ అధికారులపై కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఒత్తిడి తెస్తున్నాయి. ప్రస్తుతం పోలవరం నిర్మాణ పనులు కొనసాగుతున్నా.. నూతన అంచనాలకు కేంద్ర జలవనరుల శాఖ ఆమోదం లభిస్తేనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.

Similar News