ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేవారికి శుభవార్త

Update: 2019-06-14 11:27 GMT

ఏటీఎంలో నగదు డ్రా చేసుకోవడానికి వెళితే అక్కడ నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తాయి.. అలాంటి సమయాల్లో కోపం నషాళానికి అంటుకుంటుంది. పోనీ కొంత సమయం తరువాత అయినా ఏటీఎంలో నగదు ఫిల్ చేస్తారని అనుకుంటే అలా జరగదు.. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు తీరిగ్గా లోడ్ చేసేవారు. దీంతో ఏటీఎం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏ ఏటీఎం లోనైనా నగదు అయిపోతే అందులో మూడు గంటలలోపే నగదు లోడ్ చెయ్యాలి.. లేదంటే సంబంధిత ఏటీఎంల బ్యాంకులకు జరిమానా విధిస్తామని ఆర్బీఐ అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రాంతాన్ని బట్టి జరిమానా ఎంత ఉండాలనేది త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఏటీఎంలు నిత్యం నగదుతో ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

Similar News