ఆ బీజేపీ సీనియర్ నేత ఇకలేరు

Update: 2019-06-25 01:25 GMT

రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడు మదన్‌లాల్‌ షైనీ కన్నుమూశారు.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో కొంత కాలంగా బాధపడుతున్న మదన్‌ లాల్‌.. ఈనెల 22న న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.. మదన్‌ లాల్‌ వయసు 75 సంవత్సరాలు.. నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్‌లోని సీకర్‌ జిల్లాకు చెందిన మదన్‌లాల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్‌గా పనిచేశారు.. గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.. రాజస్థాన్‌లో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ్యుడిగా వున్నారు. చివరి వరకు ఆయన సమాజ సేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు..

మదన్‌ లాల్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.. మదన్‌ లాల్‌ మరణం పట్ల రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మదన్‌లాల్‌ మరణించారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా అన్నారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు.. మరోవైపు మదన్‌లాల్‌ పార్థివ దేహానికి అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సహా పలువురు నేతలు నివాళులర్పించారు.

Similar News