వీజీ సిద్దార్ధ అదృశ్యంలో కొత్తకోణం

Update: 2019-07-30 07:39 GMT

కాఫీ కింగ్‌ వీజీ సిద్ధార్ధ అదృశ్యంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.ఈ కేసులో అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇందులో అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు. సోమవారం బెంగళూరు నుంచి సకలేష్‌పూర్‌కు వెళ్లాలనుకున్న సిద్ధార్ధ ఉన్నట్టుండి... ఎందుకు రూటు మార్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటు నుంచి .. మంగళూరు వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పారు సిద్ధార్ద. ఆ తర్వాత ఉల్లాల్‌ బ్రిడ్జ్‌కు చేరుకున్న కొద్ది సేపటికే ఆయన... కారు దిగారని డ్రైవర్‌ చెబుతున్నారు. అనంతరం.. బ్రిడ్జ్‌పైన నడిచిన ఆయన.. ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్‌ కాల్‌ తర్వాతే ఆయన కనిపించకుండా పోయారు. దీంతో ఆయన చివరిగా ఎవరితో మాట్లాడారాన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం కాల్‌డేటాను పరిశీలిస్తున్న పోలీసులు.. ఆ కోణంలో విచారణ చేస్తున్నారు.

మరోవైపు మిస్సింగ్‌కు ముందు తన కంపెనీ డైరెక్టర్లకు లేఖ రాయడం కూడా చూస్తే.. ఆయనపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నట్లు కనిపిస్తోంది. తనపై వేధింపులు, ఒత్తిళ్లు పెరిగాయని, షేర్లు బై బ్యాక్‌ కొనాలంటూ.. ఒత్తిడి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఆదాయపన్ను శాఖ పాత డీజీ సైతం వేధింపులకు గురి చేసినట్లు ఆయన లేఖ ద్వారా తెలుస్తోంది. దీంతో ఆయనపై ఎవరెవరు ఒత్తిళ్లు తెచ్చారు? ఎందుకు ఒత్తిళ్లు తెచ్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Similar News